Flash: దారుణం..యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కామాంధులు

0
85

మహిళలపై, చిన్నారులపై దుండగుల అఘాయిత్యాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు, కఠిన చర్యలు తీసుకువస్తున్నా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు మాత్రం అరికట్టలేకపోతున్నారు పోలీసులు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకోగా..తాజాగా ఛత్తీస్​గఢ్ ​లోని సుర్గుజా అడవుల్లో ఓ యువతిపై నలుగురు కామాంధులు గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు.

అదే సమయంలో ఆమె భాగస్వామి కూడా పక్కనే ఉండడంతో అతనిని కూడా దారుణంగా కొట్టి బాధితురాలి బ్యాగులో ఉన్న డబ్బుని తీసుకొని ఘటనా స్థలం నుండి పరయ్యారు నలుగురు నిందితులు. దాంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బాదితురాలు వివరాల మేరకు నలుగురు  నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని సంతోష్ యాదవ్​, అభిషేక్​ యాదవ్​, నాగేంద్ర యాదవ్​గా పోలీసులు గుర్తించారు.