ప్రతి ఒక్కరికీ స్వచ్ఛతపై అవగాహన ఉన్నప్పుడే రాష్ట్రం స్వచ్ఛ తెలంగాణగా రూపు దిద్దుకుంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మన ఊరు-మన బడి(Mana Ooru Mana Badi) కింద అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాఠశాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ప్రాంతాలే కాకుండా పట్టణ ప్రగతికి కృషి చేస్తున్నారని వెల్లడించారు. ప్రజల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో మహేశ్వరం నియోజకవర్గంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో కోట్లాది రూపాయలతో అభివద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. అంతేగాక, నియోజకవర్గానికి మెడికల్ కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి(Sabitha Indra Reddy) ధన్యవాదాలు తెలిపారు.
Read Also:
1. తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి ఠాక్రే కీలక వ్యాఖ్యలు
2. అనుమతి ఇవ్వాలని కేంద్రమంత్రిని కలిసి రిక్వెస్ట్ చేసిన కేటీఆర్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat