Revanth Reddy | సీతక్కను ముఖ్యమంత్రి చేస్తాం: రేవంత్ రెడ్డి

-

అమెరికాలో అట్టహాసంగా జరుగుతోన్న తానా సభల్లో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలవం ప్రాజెక్టు(Polavaram Project), రాజధాని అమరావతి(Amaravati) కట్టేది కాంగ్రెస్ పార్టీయేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రెండింటినీ పూర్తిచేయడమే కాంగ్రెస్ విధానమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి(Revanth Reddy)కి ఎన్నారైలు ఆసక్తికర ప్రశ్నలు సంధించారు.

- Advertisement -

దళితులు, ఆదివాసీలను ముఖ్యమంత్రిని కానివ్వరా? అన్న ప్రశ్నకు రేవంత్ స్పందిస్తూ.. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్‌లో లేదన్నారు. అవసరమైతే సీతక్క(Seethakka)ను పార్టీ ముఖ్యమంత్రిని కూడా చేస్తుందన్నారు. ప్రజల కోసం తాను ఏమైనా చేయాలని అనుకుంటున్నానని, వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. పార్టీని, తనను వేరు చేసి చూడొద్దని, తెలంగాణలో కాంగ్రెస్సే రేవంత్‌రెడ్డి(Revanth Reddy), రేవంత్‌రెడ్డే కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు.

Read Also: ఎమ్మెల్యే ఈటల, ఎంపీ అర్వింద్‌కు భద్రత పెంపు

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

అలా చేసుంటేనే ద్రోహం అయ్యేది: చంద్రబాబు

తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu)...

మహిళల కోసం రూ.లక్ష కోట్ల ఖర్చు.. మంత్రి సీతక్క హామీ

తెలంగాణ మహిళలకు మంత్రి సీతక్క(Seethakka) గుడ్ న్యూస్ చెప్పారు. మహిళల అభ్యున్నతే...