తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని అలాగే ఆయన తనయుడు లోకేష్ బాబుని టార్గెట్ చేస్తూ వర్మ సినిమా తీస్తున్నారు అనేది కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా ట్రైలర్ చూస్తే పక్కాగా అర్ధం అవుతోంది. అయితే ఎన్నికల సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీశారు .. తర్వాత ఎన్నికలు పూర్తి అవ్వగానే ఈ సినిమా తీయడంతో, ఇప్పుడు అందరూ కావాలనే వర్మ ఇలా సినిమా ప్లాన్ చేశారు అని విమర్శలు వస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ నతేలు కేసులు వేయాలని చూస్తునారు.. అయితే పేర్లు మార్చినా పాత్రలు మాత్రం అవే కావడంతో టీడీపీ నేతలు మాత్రం తీవ్ర స్ధాయిలో విమర్శలు చేస్తున్నారు.. అయితే కొన్ని సినిమా ధియేటర్లలో ఈ సినిమా విడుదల కాకుండా చూడనున్నారట..కొందరు టీడపీ నేతల చేతుల్లో ఉన్న థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శించకూడదు అని ప్లాన్ వేస్తున్నారట.. వర్మ అనుకున్నంత సినిమా హిట్ అవ్వకుండా చేసే పనిలో ఉన్నారు టీడీపీ నేతలు అని తెలుస్తోంది.