RRR నుండి ‘ఎత్తర జెండా’ వీడియో సాంగ్‌ రిలీజ్ (వీడియో)

0
40

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కేసులు పెరగడంతో సినిమాను వాయిదా వేశారు మేకర్స్.

దీంతో మెగా నందమూరి అభిమానులు నిరాశకు గురయ్యారు. అదే సమయంలో మార్చి 25న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు మేకర్స్.అయితే సినిమా రిలీజ్ కు ముందు ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇచ్చింది ఆర్ఆర్‌ఆర్ టీం. తాజాగా ఈరోజు ట్రిపుల్ ఆర్ సెలబ్రేషన్ ఆంథమ్ సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

ఈ సాంగ్ చూస్తుంటే రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్ ముగ్గురు కూడా మెస్మరైజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పిక్స్ చూస్తే అర్ధమవుతుంది. నెత్తురు మ‌రిగితే ఎత్తర జెండా.. స‌త్తువ ఓరిమితే కొట్ట‌రా కొండా.. అంటూ సాగే ఈ పాట ప్రోమోలో రామ్ చ‌ర‌ణ, తారర్ అభిమానుల్లో అంచ‌నాల‌ను ఇంకా పెంచుతున్నారు.

https://www.youtube.com/watch?v=dtZ14XTwwos