Bandi Sanjay: అప్పుడే స్పందించాల్సింది.. నీ కిడ్నీ ఎవరికి కావాలి!

-

Bandi Sanjay Responds to Minister KTR Comments on him: మంత్రి కేటీఆర్ చేసిన సవాలు పై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. కేసీఆర్ కుటుంబ భాషను చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. తండ్రి బండి సంజయ్ ను ఆరు ముక్కలు నరుకుతా అంటడు.. ఇప్పుడు కొడుకు చెప్పుతో కొడతా అని అంటుండు ఇదేనా సంస్కారమంటే అని ప్రశ్నించాడు. తన తండ్రి సంస్కారంతో పెంచారని, కేటీఆర్, కవిత లాగా నేను సంస్కార హీనులం కాదని విమర్శించారు.  డ్రగ్స్ కేసు పై తాను ఎప్పుడో సవాల్ చేస్తే ఇప్పుడు స్పందించడమేంటి? ఆనాడే శాంపిల్ ఇచ్చి ఉంటె నిజం బయటపడేది అన్నారు. విదేశాల్లో టీట్మెంట్ చేయించుకొని ఇప్పుడు మేకపోతు గాంభీర్యంతో మాట్లాడడం విడ్డురమని అన్నారు. నీ కరాబైన కిడ్నీ ఎవరికీ కావాలని అన్నారు.

- Advertisement -

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ఎవరు ఎవరిని కాపాడేందుకు విచారణను మధ్యలోనే ఆపేశారని ప్రశ్నించారు. సిట్ నివేదికను బయటపెట్టాలని కోరారు. వేమువాడకు ఇస్తానన్న రూ. 400 కోట్లు, కొండగట్టుకు ఇస్తానన్న పైసలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ ప్రాంతాలకు రావాల్సిన సొమ్ము వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు.

Read Also: సినిమాలకు సమంత గుడ్ బై.. సామ్ PR టీమ్ ఏం చెప్పారంటే..?

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘మరోసారి బీసీలను మోసం చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర’ 

సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం...

Group 1 Mains: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్...