నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం పోరాటం చెయ్యాల్సిందే

నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం పోరాటం చెయ్యాల్సిందే

0
115

అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి రాజీ నామా డ్రామాకు తెరపడినట్లయింది. సోమవారం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును అమరావతిలో కలిశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన జేసీ..ఇప్పుడు అంతా ఆల్‌ రైట్ అని అన్నారు. ముఖ్యమంత్రి సూచన మేరకు సీఎంఓ అధికారులను కలిశానని పేర్కొన్నారు.

ఈ దేశంలో ఎవరి మీదా అలగలేమని, అలిగితే ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. తాను ఎవరి మీదో అలిగి పార్లమెంటుకు వెళ్లలేదనేది నిజం కాదని దివాకర్‌రెడ్డి చెప్పారు. సీఎం చంద్రబాబును కలిసి అంతా వివరించానని, అయితే ఆయనతో ఏం మాట్లాడాననే విషయాన్ని బయటకు చెప్పనన్నారు. ప్రస్తుతం రాజకీయ వాతావరణం బాగాలేదని, రాజకీయాల్లో అతివృష్టి, అనావృష్టి ఉండకూడదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పోరాటం కొనసాగుతుందని జేసీ స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం పోరాటం చేయాల్సిందేనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చెయ్యలేదు కానీ ఇప్పుడు చేస్తానంటే ఎవరూ నమ్ముతారని ఎద్దేవా చేశారు