జగన్ మిత్రుడు వైసీపీలోకి వెళ్లకపోవడానికి కారణం ఇదేనా

జగన్ మిత్రుడు వైసీపీలోకి వెళ్లకపోవడానికి కారణం ఇదేనా

0
87

జేసీ కుటుంబం నుంచి ఈసారి ఎన్నికల్లో వారి తనయులు ఇద్దరూ కూడా బరిలోకి దిగారు.. అనంతపురం నుంచి పవన్ రెడ్డి ఇటు తాడిపత్రి నుంచి అస్మిత్ రెడ్డి ఇద్దరూ కూడా ఓటమి పాలయ్యారు.. అయితే గెలుపు పక్కా అనుకున్న వీరు వైసీపీ వేవ్స్ లో ఓటమి పాలయ్యారు, తాజాగా పవన్ రెడ్డి గురించి చర్చ జరుగుతోంది. ఆయన జగన్ కు బెస్ట్ ఫ్రెండ్. మరి ఆయన ఎందుకు జగన్ తో చర్చించి పార్టీలోకి వెళ్లడం లేదు అని కొందరి ఆలోచన .

ఇటీవల కూడా పవన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను వైసీపీలో చేరను అని, తాను తెలుగుదేశంలోనే ఉంటాను అని ఫైనల్ గా చెప్పేశారు.. దీంతో ఆయన రాజకీయ అడుగులు తెలుగుదేశం అని తెలుస్తున్నాయి. అయితే ఇక్కడ చాలా మంది చెప్పేది ఏమిటి అంటే , పవన్ రెడ్డి మాట ఇస్తే మాటమీద ఉంటారు, అలాగే జగన్ తనకు ఫ్రెండ్, ఎక్కడైనా కనిపిస్తే మాట్లాడుతా, చిన్నతనం నుంచి మంచి మిత్రులం కాబట్టి కుటుంబం కష్టసుఖాలు మాట్లాడుకుంటాం.

అంతేకాని రాజకీయంగా కలిసి వెళ్లాలి అని లేదు, తన రాజకీయం గమ్యం వేరు నా రాజకీయ గమ్యం వేరు అందుకు నేను ఎంచుకున్న పార్టీ తెలుగుదేశం అని పవన్ తన అనుచరులతో చెప్పారట. అందుకే ఆయన వైసీపీలోకి వెళ్లే ఛాన్స్ లేదు అంటున్నారు పవన్ రెడ్డి అనుచరులు.