తెలుగు యాంకర్ రేష్మి వరుస సినిమాలతో బిజీ అవుతుంది.అయితే తాజాగా యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడిన రేష్మి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.తాను బిగ్ బాస్ షో ను చూడనంటే చూడనని చెబుతోంది.అందులో ఏమి జరిగిన సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.అన్ని అలానే తెలిసిపోతాయి అని చెప్పింది.అంతే కాకుండా బిగ్ బాస్ విన్నర్ ఎవరన్న విషయాన్ని కూడా చెప్పేసింది.కౌశల్ విన్నర్ అవుతాడు అని చెప్పేసింది.
కౌశల్ కాకుండా వేరే వారు విన్ అయితే గొడవలు అవుతాయి అని చెప్పేసింది.ధర్నాలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.కౌశల్ ఆర్మీచాలా స్ట్రాంగ్ అని.. చాలా ఫీడ్స్.. పోస్ట్స్.. వీడియోస్ చేసి పెట్టటం చూస్తే.. వన్ సైడెడ్ గా ఉందన్న మాటను రష్మి వెల్లడించింది.మరి చూడాలి బిగ్ బాస్ లో ఎవరు విన్ అవుతారో.రీసెంట్ గా తాను నటించిన అంతకు మించి సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది