ఖైరతాబాద్ లో హైటెక్ వ్యాభిచారాన్ని పోలీస్ అధికారులు గుట్టురట్టు చేశారు… పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు… తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు కిరణ్, పవన్ అనే వ్యక్తులు విలాస వంతమైన జీవితం గడపడంకోసం పంజాగుట్టా పరిధిలో ఒక అపార్ట్ మెంట్ లో ఒక రూమ్ ను అద్దెకు తీసుకుని వ్యభిచార దందాను నిర్వహిస్తున్నారు…
ఈ క్రమంలో అపార్ట్ మెంట్ లోకి గుర్తు తెలియని మహిళలు వస్తుండటంతో స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు… దీంతో పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు… ఈ దాడిలో పవన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు… వారితో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు…
పరారిలో ఉన్న కిరణ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.. కాగా ఇటీవలే విశాఖలో కూడా జబర్దస్త్ అర్టిస్టులు దొరబాబు, పరదేశీలు పోలీసులకు దొరికిపోయిన సంగతి తెలిసిందే.. విశాఖలో వీరు గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులు అరెస్ట్ చేశారు…