కుడిచేతి వాటం అయితే ఎడమచేతితో, ఎడమచేతి వాటం అయితే కుడిచేతితో తలుపులు తియ్యడంలాంటి పనులు చెయండని టీడీపీ నేత లోకేశ్ చెప్పారు.. ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు…
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి కొన్ని దేశాలు తలపట్టుకుంటుంటే కొరియాలాంటి దేశాల్లో చిన్న చిట్కాలతో కరోనాకి చెక్ పెట్టారని తెలిపారు. అందులో ప్రధానమైనదని తెలిపారు… అలవాటైన చేతిని ఎక్కువగా వాడకపోవడం
మీది కుడిచేతి వాటం అయితే ఎడమచేతితో, ఎడమచేతి వాటం అయితే కుడిచేతితో తలుపులు తియ్యడంలాంటి పనులు చెయ్యండని అన్నారు లోకేశ్ తద్వారా ఆ చేతితో మొహాన్ని తాకడం తగ్గుతుందని అన్నారు. ఈ చిన్న జాగ్రత్త కొంతవరకూ కరోనా బారిన పడకుండా ఆపుతుందని తెలిపారు. ఇది కేవలం ఒక చిట్కా మాత్రమే అని రెండు చేతులను శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరి అని తెలిపారు…