అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లతో ప్రధాన ప్రతిపపక్ష తెలుగుదేశం పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు… పాఠకులకొరకు విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్స్ యధావిధిగా…
ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి అసలు అధికారంలోకి రానే రారన్నారు ఓ పబ్లిక్ పార్క్ ఆక్రమించుకున్న ఓ విశాఖ గల్లీ నాయకుడు. పచ్చ మీడియాలో డిబేట్లతో ఊదరగొట్టి ఇప్పుడు పూర్తికాలం అధికారంలో ఉండరంటున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు తొత్తుల ప్రీపెయిడ్ సిమ్స్ కి రీఛార్జ్ చేయడం ఆపేస్తే నోళ్లు మూగబోతాయని ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి
ఏడాది కాలంగా తినడానికి ఏమీ దొరక్క నక నక లాడుతున్న టీడీపీ మిడతల దండు కమలం పువ్వు వైపు కదులుతోంది. ఇప్పటికే కొన్ని మిడతలు ఆపార్టీలో చేరి విధ్వంసం సృష్టిస్తున్న విషయం గ్రహించేలోగానే మిగతావి ఎగురుకుంటూ బయల్దేరాయి. ఈ విపత్తు నుంచి బీజేపీ ఎలా బయటపడుతుందో చూడాలి.
స్వార్థం కోసం జెండాలు మార్చేవారంతా లిటిగేటర్ల అవతారం ఎత్తుతున్నారు. ప్రజాతీర్పును అపహాస్యం చేయాలని చూస్తే ఏ వ్యవస్థా ఉపేక్షించదు. పతనమైన విలువలకు ప్రాణం పోసే యత్నం చేస్తున్న జగన్ మోహన్ రెడ్డిని ఈ శక్తులేవీ అడ్డుకోలేవు. మీడియా ఎంటర్ టెయినర్లుగా మిగలడం మినహా సాధించేది ఏముండదని అన్నారు…