బాలయ్య చిన్న అల్లుడికి చంద్రబాబు బంపర్ ఆఫర్

బాలయ్య చిన్న అల్లుడికి చంద్రబాబు బంపర్ ఆఫర్

0
105

తెలుగుదేశం పార్టీ స్పీడు పెంచింది, ఎన్నికల వేళ సరికొత్త రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టిక్కెట్ల కోసం ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. తమకు సీటు రాదు అంటే వేరే పార్టీలోకి వెళ్లి కండువా కప్పుకుంటున్నారు. చివరకు వైసీపీ జనసేనలో టికెట్ వస్తుందో రాదో అనే డైలమాలో పార్టీ నేతలు మారిపోయారు. ఇప్పుడు ఎమ్మెల్యే బాలకృష్ణ అల్లుడు విశాఖపట్నం ఎంపీ స్థానం ఆశిస్తున్న ఎంవీవీఎస్ మూర్తి మనవడు శ్రీభరత్ తెలుగుదేశం పార్టీలో మరింత యాక్టీవ్ అవ్వనున్నారు.. ఆయన ఎంపీగా విశాఖ నుంచి పోటీ చేస్తారు అని గత కొన్ని నెలలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం.

శ్రీభరత్ పేరును రాజమండ్రి లోక్సభకు పరిశీలిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడి సిటింగ్ ఎంపీ మురళీమోహన్ ఈసారి పోటీ చే యనని ప్రకటించడంతో కొత్త అభ్యర్థిని వెదుకుతున్నారు. విశాఖ జిల్లా నుంచి లోకేశ్ బరిలో దిగుతున్నందున అదే కుటుంబం నుంచి మరొకరికి విశాఖలో సీటు ఇవ్వడం సాధ్యం కానుందున, శ్రీభరత్ను పక్కన పెట్టారని ఆయనకు రాజమండ్రి ఎంపీ టికెట్ ఇచ్చి ఇక్కడ నుంచి పోటీ చేయించాలి అని చూస్తున్నారట. ఇప్పటికే వారి కుటుంబానికి ఈ విషయం చెప్పారట, మరి సాయంత్రం కల్లా ఈ విషయం పై వారు క్లారిటీ ఇవ్వనున్నారు అని తెలుస్తోంది.