టాలీవుడ్ లో కొందరు ముద్దుగుమ్మలు అవకాశాలు ఉన్న సమయంలో చిత్రాలు చేసుకుని, తర్వాత పెళ్లి చేసుకుని చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారు.. ఇంకొందరు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి చిత్రాలతో అదరగొట్టారు, ఇక సీనియర్ హీరోయిన్లు అక్క తల్లి చెల్లి పాత్రలు చేస్తున్నారు, అయితే ఇప్పుడు ఇలా తన నటనతో మంచి పేరు సంపాదించిన హీరోయిన్ శరణ్య మోహన్ గురించి తెలుసుకుందాం.
హీరోయిన్ శరణ్య మోహన్. భీమిలి కబడ్డీ జట్టు చిత్రం లో నాని సరసన తొలిసారి నటించి తెలుగు వారికి చేరువయ్యింది. వెండితెరపై తెలుగులో ఈ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చింది, ఇక ఏదైనా ఎమోషనల్ సీన్ అంటే ఆమె అద్బుతంగా చేస్తుంది అనే పేరు వచ్చింది, ఇక ఆమె క్లాసికల్ డ్యాన్సర్ చాలా ప్రదర్శనలు ఇచ్చింది, ఈ సమయంలో ఓ రోజు
మలయాళ దర్శకుడు ఫాజిల్ ఆమెని చూసి సినిమాల్లో బాలనటిగా అవకాశం ఇచ్చారు..ఆ తర్వాత మోహన్ లాల్, మమ్ముట్టి వంటి పెద్ద హీరోల సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది.
ఇక తర్వాత చదువుపై ఫోకస్ చేసి మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది, ఆమెకి వరుస అవకాశాలు వచ్చాయి.
తిరిగి చెల్లి పాత్రల్లో హీరోయిన్ గా ఇండస్ట్రీ కి రిఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా చెల్లిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎమోషనల్ సీన్స్ నటించడంతో ఆమె అద్బుతంగా పేరు తెచ్చుకుంది, ఇక శరణ్య భీమిలి కబడ్డీ జట్టు-విలేజ్ లో వినాయకుడు సినిమాలో నటించింది ఈ చిత్రాలు టాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యాయి.
ఇలా సినిమాల్లో ఉన్న ఆమె చిన్ననాటి స్నేహితుడు అయినా అరవింద్ కృష్ణన్ అనే వ్యక్తి ని 2015లో పెళ్లి చేసుకుంది. ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ప్రస్తుతం ఆమె సినిమాలు చేయడం లేదు, మంచి పాత్రలు వస్తే చేయాలి అని ఆమె అభిమానులు కోరుతున్నారు.