కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించారు.. ఈ సమయంలో ఎందరో వలస కూలీలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.. వారికి సాయం అందించి ప్రత్యేక ప్రయాణ సౌకర్యాలు కల్పించారు సోను సూద్… రియల్ హీరో అనిపించుకున్నారు..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది.
ఇక తాజాగా ఓ వార్త వినిపిస్తోంది,సోనుసూద్ చిరంజీవి కొన్ని యాక్షన్ సీన్లను చిత్రీకరించారు. ఈ చిత్రీకరణ సమయంలో చిరంజీవి సోను సూద్ కొట్టడానికి ఎంతో ఇబ్బంది పడినట్లు తెలిపారు, ఆపద సమయంలో చాలా మందిని ఆదుకున్న మిమ్మల్ని కొట్డడం అంటే ఇబ్బందిగా ఉంది అని చిరు అన్నారట.
ఒకవేళ కొట్టినా ప్రజలందరూ నన్ను తిట్టుకుంటారని అన్నారు. అంతే కాకుండా ఓ సన్నివేశంలో చిరంజీవి గారు నాపై కాలు పెట్టాల్సిన సీను ఉంటే, దానిని కూడా రీ షూట్ చేశామని సోను సూద్ తెలిపారు.ఇక హీరోగా అవకాశాలు వస్తున్నాయి, హీరో పాత్రలు చేస్తాను అని తెలిపారు.