పాన్ ఇండియా సినిమా చేయనున్న రామ్ చరణ్ – దర్శకుడు ఎవరంటే?

-

ప్రస్తుతం రామ్ చరణ్ జక్కన్న దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు… ఈ సినిమా షూటింంగ్ దశలో ఉంది.. అయితే కరోనా నేపథ్యంలో షూటింగుకి బ్రేకు వేశారు.. అయితే మన స్టార్ హీరోలు ఓ సినిమా చేస్తూనే మరో సినిమాని లైన్ లో పెడతారు.. ఇది పూర్తి అవ్వగానే ఈ సినిమాని సెట్స్ పై పెడతారు.. అభిమానులకి కూడా ఈ వార్త తెలియచేస్తారు.. ఇలాంటి సమయాల్లో పలు కథలు కూడా వింటారు.

- Advertisement -

అయితే తాజాగా హీరో రామ్ చరణ్ విషయంలో కూడా ఇదే చూస్తున్నారు అభిమానులు.. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఆయన ఏ సినిమా చేస్తారా అని ఎదురుచూస్తున్నారు, అయితే ఆచార్యలో కూడా ఓ కీలక రోల్ చేస్తున్నారు ఆయన.. మరి ఈ రెండింటి తర్వాత ఆయన నటించే సినిమా ఏమిటి అన్నది చూస్తే.

ఈ లాక్ డౌన్ సమయంలో కొన్ని కథలు విన్నారు చరణ్ …ముఖ్యంగా ఆయనకు జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి చెప్పిన కథ బాగా నచ్చిందట. ఆస్టోరీకి ఒకే చెప్పారట.. ఇక ఆస్టోరీపై ఆయన వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది…పాన్ ఇండియా మూవీగా భారీ ఎత్తున నిర్మించడానికి ప్లాన్ రెడీ చేస్తున్నారట.. నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ సినిమా తీసే అవకాశం ఉందని టాక్ .. బాలీవుడ్ భామని ఈ చిత్రంలో తీసుకునే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి ఉండాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హిందూ సమాజానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.. భూమన డిమాండ్

హిందు పరమ పవిత్రంగా భావించిన తిరుమల ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేద్దామనుకున్న...

తిరుమల లడ్డూ ప్రసాద నెయ్యిపై ఇచ్చిన నివేదిక అప్పుడే తప్పవుతుంది: NDDB

NDDB Report | తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో...