మైకేల్ థియరిటికల్ ట్రైలర్ చాలా బాగుంది – నిర్మాత పార్థు రెడ్డి ..!!

-

సాయి చరణ్ తేజ్ , ఆదిత్య శివ, శేఖర్ జిఎంఎస్, చిరంజీవి, మారుతీ సాకారం, మణిరాజ్, పవన్.జి, చిన్న నరసింహులు, అవినాష్ ప్రధాన పాత్రలలో యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌ గా రూపొందుతున్న చిత్రం ” మైకేల్ ” ఈ చిత్రానికి కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. వన్ మీడియా బ్యానర్ పై పార్ధు రెడ్డి నిర్మిస్తున్నారు. నవీన్ ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ప్రవీణ్ కుమార్ అడిషనల్ స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అందించారు.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.. ఇటీవలే విడుదలైన చిత్రం ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ రాగా నేడు ఈ చిత్రం యొక్క థియరిటికల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు చిత్ర బృందం.

- Advertisement -

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పార్థు రెడ్డి మాట్లాడుతూ.. సినిమాను చూశాను చాలా బాగా వచ్చింది.. దర్శకుడు చెప్పిన దానికన్నా చాలా బాగా సినిమా ని తెరకెక్కించాడు. అందరు కొత్తవాళ్లే అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న నటుల్లా నటించారు.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న మా సినిమాను త్వరలోనే విడుదల చేస్తాం అన్నారు..

నటీనటులు : సాయి చరణ్ తేజ్, ఆదిత్య శివ, శేఖర్ జిఎంఎస్, చిరంజీవి, మారుతీ సాకారం, మణిరాజ్, పవన్.జి, చిన్న నరసింహులు, అవినాష్ తదితరులు

సాంకేతిక నిపుణులు :
స్టోరీ-స్క్రీన్ ప్లే – ఎడిటింగ్- డైరెక్షన్: మందపాటి కిరణ్
ప్రొడ్యూసర్: పార్ధు రెడ్డి
సినిమాటోగ్రఫీ : నవీన్ ప్రకాష్
అడిషనల్ స్క్రీన్ ప్లే – డైలాగ్స్: ప్రవీణ్ కుమార్
ఆర్ట్ : సాయి వినయ్
లిరిక్స్: సాయి ప్రమోద్ పీవీ
పబ్లిసిటీ డిజైనర్: పవన్ నారావా

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...