జగన్ 23 నెంబర్ సెంటిమెంట్ ఎందుకో తెలిసిపోయింది

జగన్ 23 నెంబర్ సెంటిమెంట్ ఎందుకో తెలిసిపోయింది

0
112

వైయస్ జగన్ గత ఎన్నికల్లో ఓటమి చెందారు, ఈ ఎన్నికల్లో గెలిచారు అది కూడా గ్రాండ్ విక్టరీ, ముఖ్యంగా జగన్ కు ఇక్కడ ఇంత విక్టరీ రావడానికి తెలుగుదేశం పై ఉన్న వ్యతిరేకత అని చెప్పాలి ప్రజలు కూడా ఆ పార్టీని చీ గొట్టారు అని తేలిపోయింది.175 కు 151 స్ధానాల్లో వైసీపీ గెలిచింది ఇప్పుడు జగన్ సెంటిమెంట్ నెంబర్ చెబుతున్నారు ఆ పార్టీ నేతలు ఎందుకు ఆ సెంటిమెంట్ నెంబర్ అంటే దాని వెనుక ఓ రీజన్ ఉంది. జగన్ కు 23 నెంబర్ సెంటిమెంట్. గత ఎన్నికల్లో వైసీపీ గుర్తుపై గెలిచి 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీలో చేరి నలుగురు మంత్రులు అయ్యారు, ఇది జగన్ కు ఎంతో బాధించింది నైతికంగా చాలా పెద్ద దెబ్బ రుచి చూపించారు చంద్రబాబు, ఇక ఇప్పుడు ఆ 23 మంది ఈ ఎన్నికల్లో దారుణమైన ఓటమిని చూశారు.

అయితే తెలుగుదేశం పార్టీ తరపున సీనియర్ నేతలు కూడా ఇప్పుడు ఓటమి పాలు అవ్వడంతో, అంతా చంద్రబాబు కారణం అని అంటున్నారు, అయితే ఇప్పుడు టీడీపికి 23 సీట్లు రావడంతో జగన్ దగ్గర నుంచి 23 మంది ఎమ్మెల్యేలను దొంగచాటుగా తీసుకున్న చంద్రబాబుకు అదే 23 సీట్లు జగన్ అప్పగించారు అని, ప్రతిపక్ష పాత్ర లేకుండా చేయలేదు సంతోషించాలి అని చెబుతున్నారు, మే 23న టీడీపీకి 23 సీట్లు పైగా ఫిరాయింపు సీట్ల సంఖ్యను రిజల్ట్ గా జగన్ ఇచ్చారు అని విమర్శలు సోషల్ మీడియాలో కూడా వస్తున్నాయి, ఇది మరింత దారుణం అని చెప్పాలి 18 మంత్రులు ఓటమి పాలు అవ్వడం దేశ చరిత్రలో ఇది తొలిసారి అని చెప్పాలి.