సీఎం కేసీఆర్ “రండ” మాటకు బండి సంజయ్ కౌంటర్

CM KCR Randa Mataku Bandi Sanjay Counter

0
94

తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు బండి సంజయ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతుల ప్రయోజనాల కోసం మర్యాదగా, హుందాగా మాట్లాడారు. కేసీఆర్ కు మైండ్ దొబ్బింది. కిషన్ రెడ్డిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిండు. కేసీఆర్ నాలుకకు, మెదడుకున్న నరం కట్ అయ్యినట్లుంది. సిగ్గుండాలి. ఆ భాషను చూసి జనం నవ్వుకుంటున్నరు. కేసీఆర్ సెన్సార్ భాష వాడుతున్నడు. రండ, పిచ్చి గాడిద కొడుకులు, బేవకూఫ్, నా కొడకా…అంటూ మాట్లాడుతున్నడు. కేసీఆర్…నువ్వు ఏ భాష నేర్పుతున్నవ్ తెలంగాణ సమాజానికి? ఇది తెలంగాణ ప్రజలు వాడే భాషేనా?

ఢిల్లీకి వచ్చిపోయినంక కేసీఆర్ కు పిచ్చి ముదిరినట్లుంది. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి హద్దు మీరి దిగజారి కేంద్ర మంత్రిని పట్టుకుని మాట్లాడిండు. కేసీఆర్ జాగ్రత్త…ఏది పడితే అది మాట్లాడితే జనం సహించరు. నీ భాషను చూసి నీ సహచరులు నవ్వుకుంటున్నరు. ఛీ…థూ..అంటున్నరు. నీ నోటిని ఫినాయిల్ తో ఇనుప బ్రష్ పెట్టి గీకినా బాగుపడదు. మేం మాట్లాడితే నీ తలకాయ యాడ పెట్టుకుంటవ్?
కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిందే రైతులు పండించిన రా రైస్ కొంటమని చెప్పడానికీ కేసీఆర్ నీకు సరిగా అర్ధం కాలేదా? కేబినెట్ మీటింగ్ పెట్టి ఎట్ల తిట్టాలే…ఎట్ల బ్లఫ్ చేయాలనే దానిపైనే కేసీఆర్ చర్చించినట్లుంది. రా రైస్ కొంటమని మేం చెబుతుంటే కొనబోము, కొనుగోలు కేంద్రాలు మూసేస్తవని కేసీఆర్ చెబుతుండు.

నేను డిమాండ్ చేస్తున్న. రైతులు పండించిన వరి ధాన్యం ప్రతి గింజ కొని తీరాల్సిందే. ఎట్లా కొనవో మేం చూస్తం. ప్రతి గింజ మేమే కొంటున్నవని ఇన్నాళ్లూ రైతులను మోసం చేసినవ్ కదా. కొనకపోతే ఏం జేయాలో చేస్తం. కొనుగోలు కేంద్రాలు మూసేస్తడట. ఇదో పెద్ద కుట్ర… గత ఏడాది డిసెంబర్ లో కేసీఆర్ మాట్లాడుతూ పంట కొనుగోలు వల్ల రాష్ట్రానికి రూ.7500 కోట్ల నష్టం వచ్చింది. ఇకపై గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఉండవు అని ప్రకటించిండు. ఆనాడు ఈ గొడవే లేదు. పీయూల్ గోయల్ లేఖ రాయనేలేదు. అయినా ఆనాడు ఈ మాట చెప్పిండంటే ఇందులో పెద్ద కుట్ర లేదా? వానా కాలంలో మాదిరిగానే యాసంగిలోనూ కొని తీరాల్సిందే.. ఏ రాష్ట్రంలో లేని సమస్య తెలంగాణలోనే ఎందుకొచ్చింది? బాయిల్డ్ రైస్ లొల్లి మాత్రమే.

గతంలో కేరళ, తమిళనాడులో బాయిల్డ్ రైస్ కొనేటోళ్లు…ఇఫ్పుడు ఎవరూ తింటలేరు. మరి ఆ రైస్ ఏం చేయాలి? బాయిల్డ్ రైస్ మొత్తం నీ నోట్ల పోస్త తింటవా? ఆ బాయిల్డ్ రైస్ అంతా నీ ఫాంహౌజ్ ముందు, ప్రగతి భవన్ కుమ్మరిస్తా.. మెడమీద కత్తిపెట్టి రాయించుకున్నరట. సిగ్గుందా మెడమీద కత్తిపెడితే తాలిబన్లకు, తీవ్రవాదులకు తెలంగాణను రాసిస్తడా? మెడమీద కత్తి పెట్టినవని అన్నవ్ కదా.. అక్టోబర్ 4న లేఖ రాసిచ్చినవ్ కదా హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా ఎందుకు చెప్పలేదు? నువ్వే గెలిచేవాడివి కదా. మెడమీద కత్తిపెడితే…నీ ఫాంహౌజ్, నీ ఆస్తులన్నీ రాసిస్తవా? అక్టోబర్ 4న బాయిల్డ్ రైస్ పంపబోమని సివిల్ సప్లయిస్ అధికారి అనిల్ కుమార్ కేంద్రానికి రాసిచ్చిండు. రైస్ బ్రాన్ ఆయిల్ ఇండస్ట్రీని ఏర్పాటు చేస్తమన్నడు. ఫిజికల్ వెరిఫికేషన్ లో రికార్డులన్నీ ముందుంచుతామని హామీ ఇఛ్చినవ్.

బాయిల్డ్ రైస్ తప్ప తెలంగాణలో వేరే ఏది యాసంగిలో పండదని కేసీఆర్ అబద్దాలు చెబుతుండు. ఇదంతా పచ్చి అబద్దం. 5 రకాల వరి విత్తనాలతో పంట వేస్తే బాయిల్డ్ రైస్ గా మార్చాల్సిన అవసరమే ఉండదు. ఈ మాట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నేత తూడి దేవేందర్ రెడ్డి కూడా చెబుతుండు. మాట్లాడితే పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ లను కేసీఆర్ పదేపదే పొగుడుతుండు. పాకిస్తాన్ జనాభా 22 కోట్లు, నేపాల్ జనాభా 7 కోట్లు, బంగ్లాదేశ్ జనాభా 16 కోట్లు..మన జనాభా `140కోట్లు. వాటితో పోలికేంది? పాకిస్తాన్ ను పొగుడుతున్నవంటే. కేసీఆర్ అక్కడేమైనా పెట్టుబడులు పెట్టిండేమో? అక్కడి తీవ్రవాద శిబిరాలకు డబ్బులు పంపుతున్నడేమో నిఘా సంస్థలు దీనిపై నిఘా పెట్టాలి.

బీజేపీ హంతకుల పార్టీ అట. ఎక్కడ హత్య చేసినం మేం చెప్పాలి? నిజమైన హంతకుల పార్టీ టీఆర్ఎస్సే. నీ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నరు. నీకొడుకు నిర్వాకంవల్ల 27 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నరు. నీవల్ల నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నరు. నీకంటే హంతకుడు ఈ దేశంలోనే ఎవరూ లేరు. మత విద్వేషాలు దేశంలో ఎక్కడ జరిగినయ్..నిజమైన మత విద్వేషాలు తెలంగాణలో జరుగుతున్నయ్.
బైంసాలో మత విద్వేషాలకు కారకుడివి నీవు కాదా. నీ తాటాకు చప్పళ్లకు భయపడే ప్రసక్తే లేదు. పీయూష్ గోయల్ మమ్ముల్ని తిట్టినట్లు కథలు చెబుతుండు. రా వెళదాం. ఎవరిని ఏమన్నారో తేల్చకుందాం.. నిన్ను చూసి నవ్వుకుంటున్నడు గోయల్ రాత్రి ఓ మాట పొద్దున మరో మాట మాట్లాడుతున్నడని నవ్వుకుంటున్నడు.  నీ నిర్వాకంవల్ల విద్యుత్ సంస్థలు రూ.45 వేల కోట్లు నష్టాల్లో ఉన్నయ్. ఆ డబ్బులు ఎవరు కట్టాలి?

ఆ డబ్బులు చెల్లించకపోతే తెలంగాణలో కరెంట్ లేక అంధకారంలో పడే ప్రమాదం ఏర్పడింది. మాట్లాడితే విద్యుత్ మీటర్లు పెడుతున్నమని కథలు చెబుతుండు. కేంద్రం ఎక్కడ చెప్పింది.
ఉచిత కరెంట్ ఇవ్వడానికి బీజేపీ ప్రభుత్వం పూర్తిగా స్వాగతిస్తోంది. కరెంటు ఉచితంగా ఇచ్చి తీరాల్సిందే.  విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన 45 వేల కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించడం లేదు? ఎందుకు వాటిని మూసివేత దిశగా దిగజార్చినవ్. సికింద్రాబాద్ లో విద్యుత్ సంస్థలకు 15 శాతం నష్టాలొస్తే….పాతబస్తీలో 80 శాతం నష్టాలు ఎందుకు వస్తున్నయ్.? 75 శాతం మంది పాతబస్తీలో కరెంటు బిల్లులే చెల్లించడం లేదు. దానికి ఎవరు కారణం? ఎందుకు వసూలు చేయడం లేదో కేసీఆర్ జవాబు చెప్పాలి. రాష్ట్ర ప్రజల ద్రుష్టిని మళ్లించడానికి కేసీఆర్ చేస్తున్న కుట్ర. బీజేపీ తరపున డిమాండ్ చేస్తున్న. కొనుగోలు కేంద్రాలు మూసివేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయం.
ప్రతి గింజా కొని తీరాల్సిందే ఎందుకు కొనవో మేం చూస్తాం. కిషన్ రెడ్డి మర్యాదగా మాట్లాడే వ్యక్తి. అలాంటి నేతపై దుర్భాషలాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నం.

రైతులు వరి వేయొద్దన్నవ్ సరే…మరి ఏ పంట పండించాలి? వరి ప్రణాళిక ఎందుకు లేదు?
కేంద్రం భూసార పరీక్షలు నిర్వహించమని చెప్పి రూ.120 కోట్లు ఇచ్చింది కదా. మరి ఎందుకు భూ సార పరీక్షలు చేయడం లేదు. బీజేపీ వేస్ట్ ప్రభుత్వం అన్న ప్రశ్నకు నీ నిర్వాకంవల్ల 10 మంది రైతులు వడ్ల కుప్పలపై చనిపోయిండ్రు. వానలతో ఏడేళ్లుగా నష్టపోయిన రైతాంగాన్ని ఏ ఒక్క ఏడాదైనా కేసీఆర్ ఆదుకున్నడా? ఏ ఒక్క సంవత్సరమైనా రైతులకు బోనస్ ప్రకటించినవా? దళిత బంధు పథకం అమలు చేసేందుకు నిధుల్లేక సమస్యను పక్కదారి పట్టించేందుకు కేసీఆర్ ఈ డ్రామా ఆడుతుండు. మేం దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని అడుగుతుంటే…ఈ నాటకాలు ఆడుతుండు టీఆర్ఎసోళ్లు పార్లమెంట్ లో ఎందుకు గొడవ చేస్తున్నరో ఆ ఎంపీలకే అర్ధం కావడం లేదు…
రారైస్ ఎంతైనా కొని తీరతాం. తొలుత 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలని చెబితే కొన్నాం. ఆ తరువాత అదనంగా కొనాలని చెప్పిండ్రు. సరే అని చెప్పినం కదా. ఈ లేఖ రాసింది పీయూష్ గోయలే కదా..టీఆర్ఎస్ ప్రభుత్వంతో మాకు సంబంధం లేదు. అది రైతు ద్రోహి ప్రభుత్వం. మేం రా రైస్ పక్కాగా కొనితీరతం.

వానా కాలంలో సమస్య లేదు కదా..40 లక్షల మెట్రిక్ టన్నుల రైస్ కొనాలని ఒప్పందం జరిగినా ఇప్పటిదాకా 30 శాతం కూడా ఎందుకు కొనలేదు? రైతులను ఎందుకు ముంచుతున్నరు? అసలు దేశంలో ఎక్కడా లేని సమస్య ఇక్కడే ఎందుకొస్తోంది? ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ కంటే యూపీ, బెంగాల్, ఏపీ, ఓడిశా రాష్ట్రాలు అగ్రగామిలో ఉంది. తెలంగాణ 6వ స్థానంలో ఉంది కదా..అక్కడ లేని సమస్య ఇక్కడెందుకు? వానా కాలంలో మాదిరిగానే యాసంగిలో పండించిన ప్రతి గింజ కొని తీరాల్సిందే అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.