ఏపీ కరోనా హెల్త్ బులెటిన్ రిలీజ్..కొత్త పాజిటివ్ కేసులు ఎన్నంటే?

0
93
Covid-19 background. Stop spread and eliminate Coronavirus. Pandemics coronavirus. Epidemic backround. Healthcare background. Hands in blue medical gloves tearing the paper with covid-19 print

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజురోజుకు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండడం టెన్షన్ కలిగిస్తుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దేశంలో మూడో వేవ్‌ మొదలైందనే భయం కలుగుతుంది.

తాజాగా ఏపీలోనూ కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. సోమవారం (జనవరి 10) కొత్తగా 984 మంది వైరస్‌ బారిన పడినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 24, 280 శాంపిల్స్ పరీక్షించగా 984 కేసులు నిర్ధారణ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో వైరస్ బారిన పడి ఎవరూ చనిపోలేదు. తాజాగా..మరో 152 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు.

కాగా గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

అనంతపురం  65

చిత్తూరు         244

ఈస్ట్ గోదావరి   117

గుంటూరు 73

వైస్సార్ కడప 26

కృష్ణ   55

కర్నూల్  15

నెల్లూరు   81

ప్రకాశం    33

శ్రీకాకుళం 47

విశాఖపట్నం  151

విజయవాడ   75

వెస్ట్ గోదావరి   02