BRO Teaser | పవన్ కల్యాణ్-సాయితేజ్ BRO టీజర్ విడుదల

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై జీ స్టూడియోస్‌తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి.సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌తో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడా అంచనాలను డబుల్ చేసేలా.. ‘బ్రో’ టీజర్‌‌(BRO Teaser) మేకర్స్ విడుదల చేశారు. ముందుగా అనౌన్స్ చేసిన టైమ్ కంటే కాస్త ఆలస్యంగా ఈ టీజర్‌ని మేకర్స్ విడుదల చేసినప్పటికీ.. ఆ వెయిటింగ్‌కి సరిపడా వర్త్‌ని ఫ్యాన్స్‌కి ఇచ్చారు. పవన్ కల్యాణ్ ఎంట్రీ, డైలాగ్స్, సాయిధరమ్ తేజ్, మేకింగ్, మ్యూజిక్.. ఇలా ప్రతీది దేనికదే సాటి అనేలా ఈ టీజర్‌ ఉంది. ప్రస్తుతం ఈ టీజర్(BRO Teaser) టాప్‌లో ట్రెండ్ అవుతూ.. రికార్డులకు వేట మొదలెట్టింది.

- Advertisement -

 

Read Also:
1. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి మరో అరుదైన గౌరవం

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...