మరో పాన్ ఇండియా సినిమాలో సమంత స్పెషల్ సాంగ్?

0
42

చైతూతో విడాకుల అనంతరం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉంది సమంత.  పాన్‌ ఇండియా చిత్రం ‘యశోద’ చిత్రీకరణ దశలో ఉండగా అంతర్జాతీయ సినిమా ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’లోనూ ఆమె కీలకపాత్ర పోషిస్తోంది. గుణశేఖర్‌ దర్శకత్వంలో నటించిన ‘శాకుంతలం’ ఈ ఏడాది విడుదల కానుంది. అలాగే యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో వరుస సినిమాలకు సామ్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.

అలాగే ఆమె తొలిసారి ఓ ఐటమ్‌ సాంగ్‌లో తళుక్కున మెరిశారు. ‘పుష్ప’ సినిమా కోసం ‘ఊ అంటావా మావ’ అంటూ బన్నీతో కలిసి స్టెప్పులేశారు. సమంత వేసిన స్టెప్పులతో ఈ పాటకు మరింత క్రేజ్‌ వచ్చింది. సుమారు రెండు వారాల క్రితం విడుదల చేసిన ఈ పాట ఫుల్‌ వీడియో 73 మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకుంది.

ఈ సమయంలో ‘ఊ అంటావా’ పాట సూపర్‌హిట్‌ కావడం వల్ల తమ సినిమాలోనూ ఐటమ్‌ సాంగ్‌ను సమంతకు అప్పచెబితే బాగుంటుందని చిత్రబృందం అనుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే చిత్రబృందం సామ్‌తో సంప్రదింపులు జరపడం సహా విజయ్‌ దేవరకొండ సైతం తనకున్న చనువుతో ఆమెను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. మరి సామ్‌.. విజయ్‌ దేవరకొండ, పూరీ మాటలకు ఓకే చెప్పిందా?లేదా? తెలియాలంటే వేచి చూడాల్సిందే.