రజినీకాంత్ ‘జైలర్’ నుంచి సూపర్ అప్‌డేట్

-

సూపర్ స్టార్ రజినీకాంత్‌ నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం జైలర్(Jailer). యాక్షన్‌ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్‌, టాలీవుడ్ యాక్టర్‌ సునీల్‌, తమన్నా, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్‌, రమ్యకృష్ణ, యోగిబాబు, వసంత్‌ రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా తలైవా టీం నుంచి ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్ వచ్చేసింది. జైలర్‌ షూటింగ్ పూర్తయింది.

- Advertisement -

ఈ సందర్భంగా సెట్స్‌లో రజినీకాంత్‌(Rajinikanth), నెల్సన్‌ దిలీప్‌కుమార్‌, తమన్నా(Tamanna) అండ్ టీం కేక్‌ కట్‌ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతున్నాయి. రజినీకాంత్‌ జైలర్‌గా ఆగస్టు 10న వేట షురూ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే అప్డేట్ అందించారు. జైలర్‌(Jailer) నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన మోహన్‌ లాల్‌, సునీల్‌, తమన్నా పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. జైలర్‌ చిత్రానికి అనిరుద్ రవిచందర్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Read Also:
1. పెళ్లి పీటలెక్కబోతున్న మెగా హీరో.. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్!
2. జుట్టు కాపాడుకొనేందుకు రోజువారీ చిట్కాలు
Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

గోదావరిఖనిలో ఘోరం.. సింగరేణి ఉద్యోగి దారుణ హత్య

Alltimereport : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని(Godavarikhani)లో ఘోరం చోటు చేసుకుంది. సింగరేణి...

ట్రంప్‌కు కిమ్ నో రెస్పాన్స్.. ఫోన్ చేసినా..

Alltimereport : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌(Kim Jong...