30 వేలు పోయాయి కాని 8 ల‌క్ష‌లు వ‌చ్చింది అదృష్ట‌వంతుడు

30 వేలు పోయాయి కాని 8 ల‌క్ష‌లు వ‌చ్చింది అదృష్ట‌వంతుడు

0
100

ఒక్కోసారి దుర‌దృష్టం అదృష్టాన్ని తీసుకువ‌స్తుంది అంటారు ఇది అలాంటిదే, నిజానికి అత‌నికి 30 వేల లాస్ వ‌చ్చింది, కాని తెల్లారేస‌రికి ఏకంగా 8 ల‌క్ష‌లు వ‌చ్చింది ..మ‌రి ఇది ఎలా అని అనుకుంటున్నారా ..ఇది చ‌ద‌వండి.ఢిల్లోలో చోటు అనే వ్యక్తి బండి మీద మామిడి పళ్లు పెట్టుకుని అమ్ముతుంటాడు. ఈ స‌మ‌యంలో ప‌క్క బండి వ్య‌క్తితో అత‌నికి వివాదం వ‌చ్చింది.

ఈ స‌మ‌యంలో అత‌ని బండిపై ఉన్న మామిడి ప‌ళ్లు అన్నీ కూడా దొంగిలించేశారు జ‌నం, మొత్తం అత‌ని ప‌ళ్లు అన్నీ బ‌ళ్లు క‌వ‌ర్లు చేతుల‌తో దొరికిన‌వి తీసుకుపోయారు జ‌నం… ఇక అత‌ని బండి ద‌గ్గ‌ర ఒక్క పండు కూడా లేకుండా చేశారు, దీంతో అత‌ను క‌న్నీరు పెట్టుకున్నాడు, మిగిలిన వారు అది తీసి సోష‌ల్ మీడియాలో వీడియో పెట్టారు..

దీంతో చాలా మంది దాత‌లు అత‌ని ఫోన్ నెంబ‌ర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పెట్ట‌మ‌న్నారు.. అంతే క్ష‌ణాల్లో గంట గంట‌కి అత‌ని ఖాతాలో న‌గ‌దు వ‌చ్చాయి.. ఇలా రాత్రి అకౌంట్ నెంబ‌ర్ పెడితే ల‌క్ష‌ల రూపాయ‌లు సుమారు 8 ల‌క్ష‌లు అత‌ని అకౌంట్లో వ‌చ్చాయి. దీంతో ఆనందించాడు ఆ వ్య‌క్తి.