పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం ఎంతో సూపర్ హిట్ అయింది, ఇక సాలిడ్ హిట్ ను అందుకుంది ఈ చిత్రం..
ఇక మూడు రోజుల్లో భారీ వసూళ్లు సాధించింది.. అయితే పవన్ కల్యాణ్ ని అభిమానులు ఎలా చూడాలి అని కోరుకున్నారో అలాగే ఇక్కడ దర్శకుడు చూపించారు, దీంతో పవన్ అభిమానులు చాలా ఆనందంలో ఉన్నారు, ఇక నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమా విషయంలో ఎంతో కేర్ తీసుకున్నారు.
అయితే తాజాగా రీమేక్ చిత్రం అయినా పవన్ కు తగినట్లు కథలో మార్పులు మాటలు రాశారు వేణుశ్రీరాం… అయితే తాజాగా ఇక మరో రీమేక్ చిత్రం చేస్తున్నారు పవన్ ..దీంతో ఇప్పుడు ఈ సినిమా పై పవన్ అభిమానులు ఆలోచన చేస్తున్నారు.
అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ పై అందరి దృష్టి నిలిచింది.
ఇక ఈ చిత్రం మలయాళ చిత్ర సీమలో సూపర్ హిట్ అయింది… ఈ స్టోరీని ఇక్కడ తెలుగులో పవన్ కల్యాణ్ చేస్తున్నారు.
తెలుగులో సాగర్ కె చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు, అయితే ఈ చిత్రంలో మాటలు అద్బుతంగా రాస్తున్నారట, అయితే దీనిపై అభిమానులు ఇంకా ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. ఇందులో రానా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.