షాక్: సమంత బైసెక్సువల్ గా మారబోతుందట..!

Samantha is going to become bisexual..do you know why?

0
98

నాగచైతన్యతో విడాకుల అనంతరం కెరీర్‌లో వేగాన్ని పెంచింది హీరోయిన్ సమంత. వరుసపెట్టి ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సామ్.. తాజాగా ఓ హాలీవుడ్ సినిమాకు పచ్చజెండా ఊపింది.

గత కొద్దిరోజులుగా సమంత ఓ హాలీవుడ్ చిత్రంలో నటించబోతోందని సోషల్ మీడియా వేదికగా పలు వార్తలు షికారు చేశాయి. ఇక వాటిని నిజం చేస్తూ ఇవాళ సామ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ వేదికగా ఆ వివరాలను తెలియజేసింది.

‘ఓ బేబీ’ చిత్రాన్ని నిర్మించిన సునీత తాటి నిర్మాతగా, ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించనున్న ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ అనే హాలీవుడ్‌ చిత్రంలో సమంత నటించనుంది. ‘Arrangements Of Love’ అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో 27 ఏళ్ల బైసెక్సువల్ తమిళ అమ్మాయి‌గా సామ్ కనిపించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.