ప్రస్తుతం యూసఫ్ గూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూట్యూబ్‌లో ఫ్రాంక్ వీడియోలు చేసే శ్రీకాంత్ రెడ్డి అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు కరాటే కల్యాణికి తెలియడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తే ఉరుకునేదే లేదని శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లి నిలదీసి అతనిపై దాడి చేసింది.
శ్రీకాంత్ రెడ్డి బట్టలు ఉడదీసి రోడ్ల పై పరుగేంతించి కొట్టడంతో తీవ్రంగా మండిపడిన శ్రీకాంత్ రెడ్డి కరాటే కల్యాణి పై కూడా దాడి చేయడం జరిగింది. అనంతరం ఇద్దరు ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. శ్రీకాంత్ రెడ్డి యూట్యూబ్‌ను బ్యాన్ చేయడంతో పాటు..అతనిపై చర్యలు తీసుకోవాలని ఫైర్ అయ్యారు. ఈ ఘటనతో యూసఫ్ గూడ పరిసరప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.