Akkineni Akhil |అక్కినేని వారసుడిగా ఉండలేను.. అఖిల్ సంచలన వ్యాఖ్యలు

-

యంగ్ హీరో అఖిల్(Akkineni Akhil).. అక్కినేని వారసుడిగా సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే అఖిల్ ఇప్పటిదాకా నటించిన సినిమాలేవి పెద్దగా ఆడలేదు. దీంతో అతని ఆశలన్ని ఏజెంట్(Agent) సినిమాపైనే ఉన్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. ఇందులో అఖిల్ లుక్, బాడీ లాంగ్వేజ్ అంతా కొత్తగా ఉంది.

- Advertisement -

ఏప్రిల్ 28న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో అఖిల్ బిజీగా ఉన్నాడు. ఈ సందర్బంగా అఖిల్(Akkineni Akhil) కీలక వ్యాఖ్యలు చేశాడు. అక్కినేని వారసుడిగా తాను పనిచేయలేనని.. వారసత్వం అనేది తనకు బరువుగా ఉంటుందని వ్యాఖ్యానించాడు. విజయం వచ్చినా.. అపజయం వచ్చినా తాను తన లాగే సినిమాలు చేసుకుంటూ అఖిల్ గానే ప్రజల్లోకి వెళ్తానని స్పష్టం చేశాడు. ప్రస్తుతం అఖిల్ వ్యాఖ్యలు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

Read Also: వామ్మో.. ఒక్క సాంగ్‌కు శ్రియ అంత డిమాండ్ చేస్తోందా?

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...