తన ఫోటో మీద తానే కామెంట్స్ చేసుకున్న శ్రద్ధ దాస్

తన ఫోటో మీద తానే కామెంట్స్ చేసుకున్న శ్రద్ధ దాస్

0
79

శ్రద్ధా దాస్ ఇటీవల తాను దిగిన ఓ హాట్ ఫోటోను ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలో బికినీ ధరించిన శ్రద్ధా హాట్ హాట్ గా దర్శనమిచ్చి కుర్రకారు గుండెల్ని కొల్లగొడుతోంది. “నేను సెక్సీగా ఉంటాను. అది నాకు తెలుసు” అంటూ ఫొటోతో పాటు పోస్ట్ చేసింది. ఇంకేముంది ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. నెటిజన్లు ఈ ఫోటోను షేర్ చేస్తూ లైకులు కురిపిస్తున్నారు. ఈ మధ్య శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటోంది.

రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ లో మొదటి చిత్రమైన “పిఎస్వి గరుడవేగ” చిత్రంలో ఈ ముద్దుగుమ్మ మెరిసింది. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత ఎలాంటి చిత్రాల్లో కనిపించకపోయినా ఇప్పుడు బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయిపోయింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తూ, యాడ్ లు, ఫోటోషూట్ లతో కాలం గడిపేస్తోంది శ్రద్ధా. తెలుగులో ఆర్య-2 వంటి చిత్రాల్లో నటించినా కూడా శ్రద్ధాకు సరైన హిట్ ఇప్పటివరకూ దక్కలేదు. మరి శ్రద్ధాకు బాలీవుడ్ లో నైనా శ్రద్ధా హిట్ సాధించాలని కోరుకుందాం.