2019 ఎన్నికలో సీఎం చంద్రబాబు నాయుడు గెలవడం ఖాయం

2019 ఎన్నికలో సీఎం చంద్రబాబు నాయుడు గెలవడం ఖాయం

0
476

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్‌శాఖమంత్రి కె.ఎస్.జవహర్‌ వైసీపీ అధినేత జగన్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష అధినేత జగన్‌కి అధికారదాహం తప్పప్రజలు సమస్యలు పట్టవని ఆయనకు కావల్సింది సీఎం కుర్చీ తప్ప మరేమీకాదని ఆయన పాదయాత్రకు అర్ధం లేదని అయన అన్నారు.

జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌కు నిలకడ లేదని ఆయన అన్న ప్రజారాజ్యం పార్టీని స్థాపించి కాంగ్రెస్‌కు హోల్‌సేల్‌గా అమ్మేశారని మంత్రి ఎద్దేవా చేశారు. అలాగే పవన్‌కల్యాణ్‌ కూడా జనసేనను రిటైల్‌గా అమ్మకానికి సిద్ధం చేశారన్నారు. విశ్వసనీయతలేని అధికారమే పరమావధిగా వెళ్లే పార్టీలను ప్రజలు నమ్మరని ఆయన అన్నారు.

టీడీపీ పాలనలోనే దళితులకు న్యాయం జరిగిందన్నారు. మరోసారి సీఎం చంద్రబాబునాయుడు గెలవటం ఖాయమని మంత్రి జవహర్‌ అన్నారు. ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్‌ కారెంశివాజీ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎస్సీ, ఎస్టీ చట్టానికి తూట్లుపొడవాలని చూస్తుందని ఆరోపించారు. ఇంకా అయన మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలిస్తేనే రాష్ట్రం ఇంకా అభివృద్ధి అవుతుందని చెప్పారు.