IPL 2022: నేడు హైదరాబాద్, రాజస్థాన్ ఢీ..గెలుపెవరిది?

0
44

ఐపీఎల్ 2022 రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే 4 మ్యాచ్ లు జరగగా నేడు ఐదో మ్యాచ్ రాజస్థాన్, హైదరాబాద్ మధ్య జరగనుంది. ఈ రెండు జట్లు కూడా ఒక్కోసారి టైటిల్ సాధించాయి. ఇక తాజాగా మరో టైటిల్ కోసం రేండు జట్లు తహతహలాడుతున్నాయి.  పుణె వేదికగా సాయంత్రం 7.30 గంటలకు ఈ మాజీ ఛాంపియన్ల మధ్య మ్యాచ్​ జరగనుంది. మరి నేటి పోరులో గెలుపు ఎవరిదో తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే..

రాయల్స్ మెరుపులు మెరిపించేనా?

రాయల్స్ కు కెప్టెన్​ సంజూ శాంసన్​ కొండంత బలం. కానీ అతని ఆట రెండు, మూడు మ్యాచులకే పరిమితమవుతున్నాయి.​ ఇక విధ్వసంక జోస్​ బట్లర్​, దేవ్​దత్​ పడిక్కల్ రాణిస్తే ప్రత్యర్థికి కష్టమే. పవర్​ హిట్టర్ హెట్​మెయర్​, వాండర్​ డుస్సెన్​, జిమ్మీ నీషమ్​, రియాన్ పరాగ్​తో మిడిల్​ ఆర్డర్ బలంగా ఉంది.

రవిచంద్రన్​ అశ్విన్​, యుజ్వేంద్ర చాహల్ చేరికతో బౌలింగ్​ దళం పటిష్ఠంగా కనబడుతోంది. గతేడాది ముంబయి తరఫున అద్భుత ప్రదర్శన చేసిన ట్రెంట్​ బౌల్ట్ నేతృత్వంలో ప్రసిద్ధ్ కృష్ణ, నవదీప్​ సైనీ కూడా కీలకంకానున్నారు.

రైజర్స్ జోరు సాగేనా?

హైదరాబాద్​కు ప్రధాన ఆటగాడు కేప్టెన్ విలియమ్సన్. వెస్టిండీస్​ ఆటగాడు నికోలస్​ పూరన్​, ప్రియం గార్గ్​, రాహుల్​ త్రిపాఠీ మిడిలార్డర్​ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. డెత్​ ఓవర్స్​ స్పెషలిస్ట్​ భువనేశ్వర్​ కుమార్​, యార్కర్ కింగ్ నటరాజన్​, ఉమ్రాన్​ మాలిక్​తో బౌలింగ్​ బలంగా ఉంది. వాషింగ్టన్ సుందర్​, శ్రేయస్​ గోపాల్​, జగదీశ్ సుచిత్​ కూడా కీలకమే.

రెండు జట్ల మొత్తం సభ్యులు

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (సి), నికోలస్ పూరన్ (డబ్ల్యు), ఐడెన్ మార్క్‌రామ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, మార్కో జాన్సెన్, రవికుమార్ సమర్థ్, శ్రేయస్ గోపాల్, జగదీశ సుచిత్, గ్లెన్ ఫిలిప్స్, శశాంక్ సింగ్, విష్ణు వినోద్, ప్రియమ్ గార్గ్, కార్తీక్ త్యాగి, ఫజల్హాక్ ఫరూకీ, సౌరభ్ దూబే

రాజస్థాన్ రాయల్స్ జట్టు: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజూ శాంసన్(w/c), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, జేమ్స్ నీషమ్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, నవదీప్ సైనీ, నాథన్ కరియప్ప, నాథన్ కరియప్ప, -నైల్, కరుణ్ నాయర్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, డారిల్ మిచెల్, ఒబెద్ మెక్‌కాయ్, తేజస్ బరోకా, కుల్దీప్ యాదవ్, అనునయ్ సింగ్, కుల్దీప్ సేన్, ధ్రువ్ జురెల్, శుభమ్ గర్వాల్