బ్రేకింగ్ న్యూస్ – రోడ్డు ప్రమాదంలో యంగ్ డైరెక్టర్ మృతి …

బ్రేకింగ్ న్యూస్ - రోడ్డు ప్రమాదంలో యంగ్ డైరెక్టర్ మృతి ...

0
100

అత్యంత విషాదం అల‌ముకుంది..త‌మిళ యంగ్ డైరెక్ట‌ర్ క‌న్నుమూశారు, దీంతో కోలీవుడ్ లో విషాదం అల‌ముకుంది.తమిళ యంగ్ డైరెక్టర్ అరుణ్ ప్రశస్త్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. కోయంబత్తూర్ సమీపంలోని మెట్టుపాల్యం దగ్గర బైక్ అదుపుతప్పి లారీని ఢీ కొట్టడంతో ఈ పెను ప్రమాదం జరిగింది.

దీంతో ఆయ‌న ప్రాణాలు కోల్పోయారు, ఇక అరుణ్ కొంత‌కాలం ద‌ర్శ‌కుడు శంక‌ర్ ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేశారు, ఐ సినిమాకి కూడా ఆయ‌న అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా చేశారు, ఇక అరుణ్ మ‌ర‌ణంతో శంక‌ర్ త‌న బాధ‌ని తెలిపారు, మంచి పాజిటీవ్ ఉన్న వ్య‌క్తి మ‌ర‌ణం చాలా బాధ క‌లిగించింది అని తెలిపారు శంక‌ర్.

అరుణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం గుండెలు పగిలే బాధని కలిగిస్తుంది. ఎప్పుడు పాజిటివ్‌గా ఉంటూ తన హార్డ్ వర్క్‌తో కెరీర్‌లో ముందుకుసాగాడు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను అన్నారు ద‌ర్శకుడు శంక‌ర్. ఇక జీవీ ప్రకాష్ హీరోగా 4జీ అనే సినిమా తీశారు అరుణ్.